జనాలు చస్తుంటే నీకు నవ్వొస్తుందా .. యాంకర్కు చివాట్లు

జనాలు చస్తుంటే నీకు నవ్వొస్తుందా .. యాంకర్కు చివాట్లు

విషాదకరమైన వార్త చదువుతూ లైవ్లో ఓ యాంకర్ నవ్వడంపై  ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  బీహార్‌కు  చెందిన ఓ న్యూస్ ఛానల్  భాగమతి నదిలో వరద బీభత్సంపై రిపోర్టు చేసింది.  అయితే స్టూడియోలో న్యూస్ చదువుతూ యాంకర్ తప్పు పదం పలికి నవ్వి్ంది. ఆ తరువాత క్షమాపణ చెప్పింది.

 దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  అక్కడ జనాలు చస్తుంటే నీకు నవ్వొస్తుందా అంటూ ఫైర్ అవుతున్నారు. దీనిపై కూడా స్పందించిన యాంకర్ క్షమాపణలు కోరింది.  

Also Read : ప్రేమలో ఒట్టు వేస్తున్నారా.. తొందర పడొద్దు..

కాగా  బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో సుమారు 30 మంది పిల్లలతో ఉన్న పడవ బోల్తా పడింది, వారిలో 12 మంది తప్పిపోయారు.   ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.