నిర్మల్ జిల్లా  అడిషనల్ కలెక్టర్  కారు జప్తు

నిర్మల్ జిల్లా  అడిషనల్ కలెక్టర్  కారు జప్తు

నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్  వాహనాన్ని కోర్టు సిబ్బంది జప్తు  చేశారు. సీనియర్ సివిల్ జడ్జి  ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ ఉపయోగిస్తున్న ఇన్నోవా కారు (నెంబరు టీఎస్ 18 6446) ను మంగళవారం సీజ్ చేశారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కింద ముంపునకు గురైన రైతులు పరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు. 

నర్సాపూర్  జి మండలం  బామిని గ్రామస్థులు తమకు ముంపు పరిహారం ఇంకా రూ.21 లక్షలు చెల్లించాలని కోర్టును ఆశ్రయించారు.  పరిహారం చెల్లింపు  విషయంలో ఆలస్యం  కావడంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇవాళ  జప్తు చేశారు. గతంలో కూడా ఎస్పీరెస్పీ  ముంపు పరిహారం  అందించడంలో  ఆలస్యం చేసినందుకు  కలెక్టరేట్ లోని  సామగ్రిని కోర్టు  జప్తు చేసింది. ఇప్పుడు మరోసారి అడిషనల్ కలెక్టర్ కారును జప్తు చేశారు.