అమ్మకానికి వాడకంలోలేని సర్కారు ఆస్తులు

అమ్మకానికి వాడకంలోలేని సర్కారు ఆస్తులు

రోడ్లు, రైల్వేలు, గ్యాస్ పైప్‌‌‌‌లైన్స్‌‌ వంటి సెక్టార్లలోని ఉపయోగంలోలేని  ప్రభుత్వ ఆస్తులను అమ్మేందుకు నేషనల్ మానిటైజేషన్ పైప్‌‌లైన్ (ఎన్‌‌ఎంపీ) ప్రాజెక్ట్‌‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. ఎన్‌‌ఎంపీ ద్వారా  వచ్చే నాలుగేళ్లలో రూ. ఆరు లక్షల కోట్లను సేకరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 88 వేల కోట్లను, 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.62 లక్షల కోట్లను, 2023–24 లో రూ. 1.79 లక్షల కోట్లను, 2024–25 లో రూ. 1.67 లక్షల కోట్లను సేకరించడమే టార్గెట్‌‌గా ప్రభుత్వం పెట్టుకుంది. ఎన్‌‌ఎంపీ ద్వారా సేకరించిన ఫండ్స్‌‌ను దేశంలోని ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌మెంట్‌‌ కోసం వాడతామని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రభుత్వానికి చెందిన భూములను అమ్మమని, ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన  ఆస్తుల (బ్రౌన్‌‌ఫీల్డ్‌‌ అసెట్స్‌‌) ను అమ్ముతామని సీతారామన్ ప్రకటించారు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌‌లైన్‌‌, నేషనల్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ పైప్‌‌లైన్‌‌ రెండు ప్రాజెక్ట్‌‌లు ఈ ఏడాది నుంచి కలిసి పనిచేస్తాయని చెప్పారు.  ‘ఎన్‌‌ఎంపీ కింద ఎటువంటి భూముల అమ్మకం చేపట్టం. ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు, ఆస్తులు..అంటే ఏవైతే ఇబ్బందుల్లో ఉన్నాయో , 
ఇంకా పూర్తిగా మానిటైజ్‌‌ (అమ్మడం) కాలేదో లేదా వాడకుండా మిగిలి ఉన్న ఆస్తులను మాత్రమే అమ్ముతాం. మానిటైజేషన్ వలన పొందిన ఫండ్స్‌‌తో మరింతగా ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను డెవలప్ చేయొచ్చు ’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆస్తులను అమ్మడం అంటే ప్రభుత్వ ఓనర్‌‌‌‌షిప్‌‌ను ఇవ్వడం కాదని నీతీ ఆయోగ్‌‌  వైస్‌‌ చైర్మన్ రాజీవ్‌‌ కుమార్‌‌‌‌ పేర్కొన్నారు. ‘పారదర్శకంగా, నిజాయితీతో మంచి వాల్యూను పొందుతాం. చివరికి ఈ ఆస్తులు తిరిగి ప్రభుత్వానికి అందుతాయి’ అని పేర్కొన్నారు. ఉదాహరణకు అన్ని ప్రభుత్వ కంపెనీల గెస్ట్​హౌజ్​లను  ప్రైవేట్‌‌ వాడాకానికి ఇవ్వడం ద్వారా లాభాలను పొందవచ్చు. ఇలాంటివి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. రోడ్లు, రైల్వేలు, పవర్ , టెలికం, వేర్‌‌‌‌హౌసింగ్‌‌, పవర్‌‌‌‌ జనరేషన్‌‌, నేచురల్ గ్యాస్‌‌ పైప్‌‌లైన్స్‌‌, ప్రొడక్ట్‌‌ పైప్‌‌లైన్‌‌, మైనింగ్‌‌, ఏవియేషన్‌‌, పోర్ట్స్‌‌, స్టేడియాలు, అర్బన్ రియల్‌‌ ఎస్టేట్‌‌ వంటి సెక్టార్లలో ఆస్తులను అమ్మడం ద్వారా ఎన్‌‌ఎంపీ టార్గెట్‌‌ను చేరుకోనున్నారు. 

మరిన్ని అంశాలు...
1)    కొంత కాలం వరకే ప్రైవేట్ వ్యక్తులకు లేదా కంపెనీలకు ప్రభుత్వ ఆస్తులను ఇస్తారు. ఈ టైమ్‌‌‌‌‌‌ పూర్తయ్యాక  మళ్లీ ఆ ఆస్తులను ప్రభుత్వమే తీసుకుంటుంది. 
2)    చాలా వరకు ఆస్తులను ఇన్‌‌‌‌విట్‌‌‌‌ లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ విధానంలో మానిటైజ్ చేస్తారు. కొన్ని అసెట్స్‌‌‌‌ను ఇన్‌‌‌‌విట్‌‌‌‌ కింద తెస్తారు. ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడులు పెట్టొచ్చు. ఈ ఆస్తులు జనరేట్ చేసిన ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ను డివిడెండ్స్‌‌‌‌ కింద ఇన్వెస్టర్లకు పంచుతారు.
3)    ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ను డెవలప్‌‌‌‌ చేయడంలో ప్రైవేట్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌ను వినియోగించుకోవడానికే  ఎన్‌‌‌‌ఎంపీని తీసుకొచ్చారు.
4)    నేషనల్ మానిటైజేషన్ పైప్‌‌‌‌లైన్‌‌‌‌లో రోడ్లు, ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్‌‌‌‌, హైవేలు, రైల్వేలు, పవర్‌‌‌‌‌‌‌‌, పైప్‌‌‌‌లైన్‌‌‌‌ అండ్  నేచురల్ గ్యాస్‌‌‌‌, సివిల్‌‌‌‌ ఏవియేషన్‌‌‌‌, షిప్పింగ్ పోర్ట్స్‌‌‌‌ అండ్ వాటర్ వేస్‌‌‌‌, టెలికమ్యూనికేషన్స్‌‌‌‌, ఫుడ్‌‌‌‌ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌, మైనింగ్‌‌‌‌, కోల్‌‌‌‌, హౌసింగ్‌‌‌‌ అండ్ అర్బన్ అఫైర్స్‌‌‌‌కు చెందిన మినిస్ట్రీలు భాగం పంచుకుంటాయి. 
5)    ఫండ్స్‌‌‌‌ను సేకరించడానికి  వివిధ మార్గాలను వెతుకుతున్నామని, దీని కోసం నేషనల్ మానిటైజేషన్ పైప్‌‌‌‌లైన్‌‌‌‌ను తీసుకొస్తామని  ఈ ఏడాది బడ్జెట్‌‌‌‌లోనే ప్రభుత్వం ప్రకటించింది.  
6)    ఎన్‌‌ఎంపీ  మొత్తం 20 రకాల ఆస్తులను కవర్ చేయనుంది. 12 మినిస్ట్రీలు ఈ ప్రాజెక్ట్‌‌లో భాగం పంచుకోనున్నాయి.
7)    రాష్ట్రాలు తమ ఆస్తులను మానిటైజ్ చేస్తే కేంద్రం వీటికి ప్రోత్సాహకాలను ఇస్తుంది. ఇందులో భాగంగా 50 ఏళ్ల వరకు వడ్డీ లేకుండా అప్పు ఇస్తుంది. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌‌లో రూ. 5,000 కోట్లను కేటాయించింది కూడా.
8)     రాష్ట్రాలు తమ సంస్థల్లోని వాటాలను అమ్ముకుంటే  100 శాతం ఆర్థిక సహకారాన్ని కేంద్రం నుంచి పొందొచ్చు.
9)    అదే మానిటైజ్ చేస్తే అమౌంట్‌‌లో 33 శాతాన్ని రాష్ట్రాలు పొందుతాయి.
10) ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు స్టాక్‌‌ మార్కెట్‌‌లో లిస్టింగ్ అయితే, ఈ ప్రాసెస్‌‌లో సేకరించిన ఫండ్స్‌‌లో 50 శాతం రాష్ట్రాలకు దక్కుతాయి.