తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: నితిన్ గడ్కరీ

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: నితిన్ గడ్కరీ

నిజామాబాద్:  కాంగ్రెస్,  బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప.. ప్రజా సంక్షేమం కనిపించడంలేదన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. తెలంగాణలో బీజేపీకి భారీగా ఆదరణ లభిస్తుందని.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేస్తామని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 29వ తేదీ గురువారం జిల్లాలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో నితిన్ గడ్కరీ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కాంగ్రెస్ పాలనలో అనేక గ్రామాలు అద్వాన్నంగా తయారయ్యాయని విమర్శించారు. రోడ్లు, తాగు నీరు సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడ్డారని.. సర్కార్ ఆసుపత్రులు అందుబాటులో లేక అనేక గ్రామాలు ఖాళీ అయ్యాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలని..  రైతులకు ఆర్థిక చేయూతనిచ్చి.. వారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని గడ్కరీ అన్నారు.

ALSO READ :- చనిపోయి.. గంట తర్వాత మళ్లీ బతికాడు

 తెలంగాణలో సాగవుతున్న పసుపు.. ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోందని చెప్పారు. విమానాలకు ఇంధనం అందించే సత్తా మన రైతుల్లో ఉందన్నారు.