బడుగుల ఆశాజ్యోతి కాకా కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం

బడుగుల ఆశాజ్యోతి కాకా కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
  • అధికారికంగా జయంతి వేడుకలు
  • మంచిర్యాల జిల్లాలో సంబురాలు
  • కాంగ్రెస్​ నేతల ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు

నెట్​వర్క్, వెలుగు: తెలంగాణ ఉద్యమనేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) బడుగుల ఆశాజ్యోతి, సింగరేణి సంస్థను కాపాడిన గొప్ప నేత అని వక్తలు అన్నారు. ఆదివారం కాకా 96వ జయంతి వేడుకలను మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అభిమానులు, కాంగ్రెస్ ​నేతలు, మాల సంఘం, వివిధ వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో కాకా విగ్రహాలు, ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేకులు కట్​ చేసి సంబురాలు చేసుకున్నారు. క్యాతనపల్లి మున్సిపల్​ ఆఫీస్​లో కమిషనర్​గద్దె రాజు ఆధ్వర్యంలో, చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రిలో  వేడుకలు నిర్వహించారు. 

ఐఎన్టీయూసీ సెంట్రల్ సెక్రటరీ బరపటి మారుతీ ఆధ్వర్యంలో అన్ని యూనియన్ల లీడర్లతో కలిసి శ్రీరాంపూర్​సింగరేణి ఓపెన్​ కాస్ట్ బొగ్గు గనిపై జయంతి వేడుకలు జరిపారు. -అణగారిన వర్గాల సంక్షేమానికి పాటుపడ్డారని కొనియాడారు.

యూనిఫాంలు, నిత్యావసరాల పంపిణీ

క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ లీడర్లు మందమర్రి మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, మున్సిపల్​ మాజీ  కౌన్సిలర్​పార్వతి విజయ ఆధ్వర్యంలో డప్పు కళాకారులకు యూనిఫామ్​లు, పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. గాండ్ల సమ్మయ్య పాల్గొన్నారు. చెన్నూరు పట్టణంలోని అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో అనాథలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఐఎన్టీయూసీ లీడర్,​ వివేక్​యువసేన వ్యవస్థాపక ప్రెసిడెంట్ బరపటి మారుతి, యూత్​కాంగ్రెస్ సెక్రటరీ తోకల సురేశ్ ​యాదవ్, యూత్​ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో సాయి అంధుల దృష్టి స్కూల్​ విద్యార్థులకు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. 

జిల్లా వ్యాప్తంగా అన్నదానాలు

మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్​నేతలు పిన్నింటి రఘునాథ్​ రెడ్డి, సుదమల్ల హరికృష్ణ, నస్పూర్​లోని సీసీసీ కార్నర్​ వద్ద బరపటి మారుతి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. చెన్నూరు నియోజకవర్గంలోని రామకృష్ణాపూర్​లోని పార్టీ ఆఫీస్​వద్ద, మందమర్రిలోని క్యాంపు ఆఫీస్, చెన్నూరులోని కొత్త బస్టాండ్​ఏరియాలో, మండల కేంద్రాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మాల సంఘం జిల్లా లీడర్లు జూపాక సుధీర్, పొట్ట మధుకర్, గజెల్లి లక్ష్మణ్​ పాల్గొన్నారు. కాకా సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల యాదగిరి ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో ఆల్పాహారం పంపిణీ చేశారు.