పార్లమెంట్ ముందు విపక్షాల ఆందోళన

పార్లమెంట్ ముందు విపక్షాల ఆందోళన

 పార్లమెంట్ ముందు విపక్షాలు ఆందోళనకు దిగాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందంటూ నిరసనకు దిగారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా నిరసనలో పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరి కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  ఇవాళ రాష్ట్రపతి ప్రసంగంపై కేంద్రమాజీ మంత్రి అనురాగ్  ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు.లోక్ సభలో తీర్మానం పై చర్చకు 16 గంటల సమయం కేటాయించారు.  అయితే నీట్, నిరుద్యోగం,అగ్నిపథ్, అంశాలపై విపక్షాలు ఆందోళనకు సిద్దమయ్యాయి. నీట్, కొత్త చట్టాలపై లోక్ సభలో  కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. నీట్ పై  చర్చకు సిద్ధమే కానీ ముందుగా ధన్యవాద తీర్మానమని కేంద్రం చెబుతోంది.