
గండిపేట: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ) 2025-–26 విద్యా సంవత్సరానికి వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన విశ్వవిద్యాలయాల డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును జులై 18 వరకు పొడిగించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఈ.సి.హెచ్. విద్యాసాగర్ తెలిపారు.
విద్యార్థులు మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.pjtsau.edu.in సంప్రదించాలని సూచించారు.