ఒలింపిక్స్ నిర్వహణ 140 కోట్ల భారతీయుల కల.. ఐవోసీ అవకాశం ఇస్తే సత్తా చూపిస్తాం

ఒలింపిక్స్ నిర్వహణ 140 కోట్ల భారతీయుల కల.. ఐవోసీ అవకాశం ఇస్తే సత్తా చూపిస్తాం

భారత దేశంలో ఒలింపిక్స్ నిర్వహణకు ఉత్సాహంగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 2023లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఏ అవకాశాన్ని కూడా తాము వదలిపెట్టమని చెప్పారు. 2029లో యూత్ ఒలింపిక్స్ను నిర్వహించేందుకు భారత్ ఉవ్విళ్లూరుతోందని చెప్పారు.  ఇందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి తమకు మద్దతు లభిస్తుందని నమ్ముతున్నట్లు మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబైలో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. 

దేశంలో ఒలింపిక్స్ నిర్వహణ 140 కోట్ల మంది భారతీయుల కల అని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ క్రీడా టోర్నీలను నిర్వహించే సామర్థ్యం భారతదేశానికి ఉందని చెప్పారు.  సింధు లోయ నాగరికత నుంచి వేదాల యుగం వరకు దేశంలో కీడల వారసత్వం సుసంపన్నంగా ఉందన్నారు ప్రధాని మోదీ. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే భావనను క్రీడలు బలపరుస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో క్రీడాకారులను బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. భారతదేశంలో 40 ఏండ్ల తర్వాత ఐవోసీ సెషన్ జరగడం గర్వంగా ఉందన్నారు.