వాటినే నమ్ముకుంటున్నరు?

వాటినే నమ్ముకుంటున్నరు?
  • సీసీ కెమెరాలు, సెల్‌‌‌‌ ఫోన్‌‌‌‌ సిగ్నల్స్‌‌నే..నమ్ముకుంటున్నరు?
  • మేధో శక్తికి పనిపెట్టని పోలీసులు!

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌,వెలుగు: సింగరేణి కాలనీ చిన్నారి రేప్ అండ్ మర్డర్ జరిగి వారం దాటినా రేపిస్టు రాజు తప్పించుకు తిరుగుతుండటం చర్చనీయంగా మారింది. సుమారు వెయ్యి మంది పోలీసులు సెర్చ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నా పట్టుకోలేకపోతున్నారు. అతని కదలికలు పలు సీసీ టీవీలకు చిక్కినా పోలీసులకు చిక్కకుండా ఎస్కేప్‌‌‌‌‌‌‌‌ అవుతున్నాడు. కేవలం సీసీటీవీ ఫుటేజీనే నమ్ముకోవడమే ఇందుకు కారణమని ఓ సీనియర్ మాజీ ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ అభిప్రాయపడ్డారు. పోలీస్‌‌‌‌‌‌‌‌ బుర్ర ఉపయోగించి ఫిజికల్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుండేదన్నారు. ‘‘ఒకప్పుడు క్రైమ్ జరిగితే విచారణలో హ్యూమన్ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యమిచ్చేవాళ్లం. నేరగాళ్లను గుర్తించడం, పట్టుకోవడంలో మేధో శక్తికి పని పెట్టి ఫలితం సాధించేవాళ్లం. ప్రత్యక్ష సాక్షులు, బాధితులను విచారించి ఎవిడెన్సులు సేకరించేవాళ్లం. నేరం జరిగిన తీరును, సీన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ అఫెన్స్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించగానే క్రిమినల్స్‌‌‌‌‌‌‌‌ ఎవరన్న దానిపై అంచనాకు వచ్చేవాళ్లు. అనుమానితులను విచారించడం, నిందితుల కాంటాక్టులను ట్రేస్‌‌‌‌‌‌‌‌ చేయడం తదితర పద్ధతుల్లో ఫలితం సాధించేవాళ్లు. ఇలాంటి దర్యాప్తుల్లో కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ నుంచి ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌వరకు క్రైమ్‌‌‌‌‌‌‌‌, క్రిమినల్స్ ట్రేసింగ్‌‌‌‌‌‌‌‌ స్కిల్స్‌‌‌‌‌‌‌‌ ఉండేవి” అని వివరించారు. రేపిస్ట్ రాజు కేసులో కూడా అలాంటి పద్ధతుల్లో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఆ ఆఫీసర్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇలాంటి కేసుల్లో నిందితుని కాంటాక్టులు, నేరానికి పాల్పడ్డ తీరు (మోడస్ ఆపరెండీ) ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేయాలి. టెక్నాలజీపైనే ఆధారపడితే ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌ బ్రేకయ్యే ప్రమాదముంది” అన్నారు.
దర్యాప్తు నుంచి అరెస్టు దాకా..
టెక్నాలజీ డెవలపయ్యాక పోలీసుల ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌లో మార్పులొచ్చాయి. ‘ఒక్క సీసీటీవీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం’ అనే స్లోగన్‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యమిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ను సీసీ కెమెరాలకు వదిలేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దర్యాప్తు ప్రారంభం నుంచి నిందితుడి అరెస్టు దాకా సీసీ ఫుటేజ్‌‌‌‌‌‌‌‌, సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్స్‌‌‌‌‌‌‌‌నే నమ్ముకుంటున్నారు. నేరగాళ్లు కూడా ట్రిక్స్ ప్లే చేస్తూ పోలీసులకు టోకరా ఇస్తున్నారు. ఆధారాలు లభించకుండా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. నేరం చేసే సమయాల్లో సీసీ కెమెరాల్లో పడకుండా తప్పించుకుంటున్నారు. సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్స్ ఉపయోగించకుండా, సీన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ అఫెన్స్‌‌‌‌‌‌‌‌లో ఫింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రింట్స్‌‌‌‌‌‌‌‌ కనిపించకుండా చేస్తున్నారు.
టెక్నాలజీ ఫెయిలైతే అంతేనా...?
స్మార్ట్‌‌‌‌‌‌‌‌ పోలీస్ ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌లో పోలీసులకు కొత్త సవాళ్లు ఎదురౌతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్‌‌‌‌‌‌‌‌, సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్ సిగ్నల్స్ లభించని కేసుల్లో ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌ ముందుకు సాగట్లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేపిస్ట్ రాజు ఫోన్‌‌‌‌‌‌‌‌ వాడి ఉంటే బహుశా ఇప్పటికే చిక్కేవాడని 
పోలీసులంటున్నారు. 

‘‘ ఫిబ్రవరిలో ఓ వాంటెడ్‌‌‌‌‌‌‌‌ ప్రాపర్టీ అఫెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను పట్టుకునేందుకు పోలీసులు అతని సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. అఫెన్స్ జరిగిన డేట్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ సాయంతో నిందితుడి కోసం గాలించారు. కానీ పోలీసులకు చిక్కకుండా ఆ దొంగ తన సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌లో ట్రిక్స్ ప్లే చేశాడు. ఫోన్‌‌‌‌‌‌‌‌ ఇంట్లోనే పెట్టి చోరీలు చేశాడు. తన కదలికలు పోలీసులకు చిక్కకుండా  చూసుకున్నాడు’’