ఇందిరమ్మ’ స్కీమ్‌‌ తో నెరవేరుతున్న పేదల సొంతింటి కల

ఇందిరమ్మ’ స్కీమ్‌‌ తో  నెరవేరుతున్న పేదల సొంతింటి కల
  • మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు

జయశంకర్‌‌ భూపాలపల్లి,వెలుగు : పేదల సొంతింటి కల ‘ఇందిరమ్మ’ పథకం ద్వారా నెరవేరుతోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు చెప్పారు. భూపాలపల్లి జిల్లా కాటారంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గురువారం మంజూరు పత్రాలు అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను మంజూరు చేశామని, వాటి పనులు స్పీడ్‌‌గా సాగుతున్నాయన్నారు. అర్హులైన పేదలకు నాలుగు విడతల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. ఇండ్ల నిర్మాణానికి ఆర్థికంగా ఇబ్బందులు పడేవారికి డ్వాక్రా సంఘాల ద్వారా లోన్లు ఇప్పించి, పనులు కొనసాగేలా చూస్తున్నామన్నారు. 

ఇండ్ల నిర్మాణాల్లో ఆలస్యం జరగకుండా ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నిర్మాణాలు ఆగినట్లయితే ఆఫీసర్ల వేతనాల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. 

అనంతరం పోషణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌ రాహుల్‌‌శర్మ, కాటారం సబ్‌‌ కలెక్టర్‌‌ మయాంక్‌‌ సింగ్‌‌, ట్రేడ్‌‌ కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌ ఐత ప్రకాశ్‌‌రెడ్డి, ఈజీఎస్‌‌ రాష్ట్ర కౌన్సిల్‌‌ సభ్యుడు దండు రమేశ్‌‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌ రాజబాబు, మార్కెట్‌‌ కమిటీ చైర్మన్‌‌ తిరుమల సమ్మయ్య, జడ్పీ సీఈవో విజయలక్ష్మి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు