
భారత షట్లర్ పీవీ సింధు సత్తా చాటింది. మలేషియా మాస్టర్స్‌లో చైనాకు చెందిన జాంగ్ యిూ మాన్‌పై వరుస గేమ్‌లలో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్ లో సింధు 21-,12, 21-, 10 తేడాతో జాంగ్ యిూ ను ఓడించింది. 28 నిమిషాలు పాటు జరిగిన ఈ మ్యాచ్ లో సింధు రెండు రౌండ్ లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి క్వార్టర్‌లోకి ప్రవేశించింది. ఇదిలా ఉంటే, పురుషుల సింగిల్స్ పోరులో షట్లర్ సాయి ప్రణీత్ మాత్రం నిరాశపరిచాడు. చైనాకు చెందిన లీ షి ఫెంగ్ చేతిలో 21-,14, 21-,17తో ఓడిపోయాడు.