రైల్వేలో 9వేల టెక్నిషియన్ పోస్టులు పూర్తి వివరాలు ఇవే

రైల్వేలో  9వేల టెక్నిషియన్ పోస్టులు పూర్తి వివరాలు ఇవే

RRB నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. జాబ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రైల్వే బోర్డ్ గుడ్ న్యూస్  చెప్పింది. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో  వివిధ విభాగాల్లో మొత్తం 9,000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు రెడీ అయింది. టెక్నీషియన్  గ్రేడ్-I  పోస్టులు 1,100, టెక్నీషియన్ గ్రేడ్- III  పోస్టులు 7,900 రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 9 నుండి ప్రారంభమవుతుండగా..  అప్లయ్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 8. RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లయ్ చేసేముందు పోస్టుల వివరాలు,  విద్యార్హత,   ఎంపిక ప్రక్రియ,  జీతం,  వయోపరిమితి, తదితర విషయాలను తెలుసుకోవడం ముఖ్యం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూద్దాం.

దరఖాస్తు వివరాలు, అప్లికేషన్ ఫీజు
ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ , పీడబ్ల్యూడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీ లేదా ఈబీసీ అభ్యర్థులకు రూ.250, ఇతరులకు రూ.500లు అఫ్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు. టెక్నీషియన్ గ్రేడ్ I అభ్యర్థులు 18 నుంచి -36 ఏళ్ల వయసు ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ IIIకు18, -33 సంవత్సరాల మధ్య వయోపరిమితి గల వారు అర్హులు. దరఖాస్తు ఆన్ లైన్ పద్ధతిలో ఉంటుంది.  టెక్నిషియన్  పోస్టును బట్టి అధికారిక వెస్ సైట్ లో విద్యా అర్హతలు ఉండాలి. రిటన్ టెస్ట్, సిలబస్ త్వరలో విడుదల చేస్తారు.  

సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, గౌహతి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, అజ్మీర్, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ రీజియన్ లో  ఖాళీలు ఉన్నాయి. రెండు దశల్లో కంఫ్యూటర్ బేసడ్ టెస్ట్ నిర్వహించి, తర్వాత  కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఉంటుంది. వీటిలో మిరిట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్  చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు నెలకు రూ.29,200, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు నెలకు రూ.19,900 జీతం వస్తుంది.

Also Read : ఇన్సాట్​ వ్యవస్థ