
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్‌లోని క్షత్రియ ఫంక్షన్ హాల్ లో ఆదివారం రాత్రి శ్రీశ్రీశ్రీ నారాయణ స్వామిజీ వారి ఆధ్వర్యంలో కోటి రామనామ సంకీర్తన కల్యాణం జరిగింది. నారాయణ స్వామి మహారాజ్ మాట్లాడుతూ మనిషి జీవితానికి ఆధ్యాత్మికత అవసరమన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సంకర్తీన కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఆర్మూర్ లో నారాయణ స్వామిజీ మహారాజ్ ఆధ్వర్యంలో రామనామ సంకీర్తన కల్యాణం నిర్వహించడం గొప్ప విషయమన్నారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అర్గుల్ సురేశ్, రాంప్రసాద్, నూకల శేఖర్, ప్రభు, గోవింద్ పేట్ గంగారెడ్డి, జై కిషన్ తదితరులు పాల్గొన్నారు.