
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ‘నైంటీస్’.ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’సిరీస్ ఫేమ్ ఆదిత్య హసన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. గురువారం పూజాకార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.
హీరోయిన్ రష్మిక మందన్న క్లాప్ కొట్టగా, నటుడు శివాజీ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. దర్శకులు వెంకీ అట్లూరి, కళ్యాణ్ శంకర్.. ఆదిత్య హసన్‌కి స్క్రిప్ట్ ను హ్యాండోవర్ చేశాడు. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను జూన్ నుంచి ప్రారంభించబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు.
And it begins for the MOST RELATABLE LOVE STORY 😍@SitharaEnts Production No. 32 takes off with a pooja ceremony full of love ❤️
— Fortune Four Cinemas (@Fortune4Cinemas) May 15, 2025
&
Regular shoot commences this June 🫶🏻
Clap by @iamRashmika
Camera Switch On by @ActorSivaji
Script handover by #VenkyAtluri & @kalyanshankar23 pic.twitter.com/cPRozAaExH
శివాజీ, వాసుకి ఆనంద్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ‘బేబి’లాంటి సూపర్ హిట్ తర్వాత ఆనంద్, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తుండడం, ‘నైంటీస్’. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’సిరీస్‌కు సీక్వెల్‌గా ఆదిత్య హసనే దీన్ని తెరకెక్కిస్తుండడంతో అంచనాలు నెలకొన్నాయి.