రిలయన్స్‌ జియో వరల్డ్ డ్రైవ్ ప్రీమియం మాల్‌ ప్రారంభం

 రిలయన్స్‌ జియో వరల్డ్ డ్రైవ్ ప్రీమియం మాల్‌ ప్రారంభం

జియో వరల్డ్ డ్రైవ్ ప్రీమియం మాల్‌ ను ఇవాళ(శుక్రవారం) రిలయన్స్ సంస్థ ప్రారంభించింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో దీన్ని స్టార్ట్ చేశారు. 17.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ మాల్‌ను నిర్మించారు. దీంట్లో 72 ఇంటర్నేషనల్, భారతీయ బ్రాండ్ల షాపులు ఉన్నాయి. ఫుడ్ కు సంబంధించిన 27 రకాల ఔట్లెట్లు ఉన్నాయి. భారీ రూఫ్ టాఫ్ థియేటర్‌తో పాటు ఓపెన్ ఎయిర్ మార్కెట్ కూడా ఉన్నట్లు రిలయన్స్ తెలిపింది.

రూఫ్ టాప్ థియేటర్లను PVR ఆపరేట్ చేయనున్నది. జియో థియేటర్  దగ్గర సుమారు 290 కార్లకు పార్కింగ్ స్పేస్ కల్పించారు. థియేటర్ దగ్గర  VVIPలకు సపరేట్ ఎంట్రీ ఉంటుంది. రెండు డోసుల కరోనా టీకా తీసుకున్న వారికి మాత్రమే ప్రస్తుతం ఎంట్రీ కల్పిస్తున్నారు. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ రాస్ బాన్‌థోర్న్‌, ఆండీ లాంపార్డ్‌లు ఈ మాల్‌ను డిజైన్ చేశారు.