వీడియో: తమ వాహనాన్ని ఢీకొట్టాడని చితక్కొట్టారు

 వీడియో: తమ వాహనాన్ని ఢీకొట్టాడని చితక్కొట్టారు
  • దేశ రాజధాని ఢిల్లీలో ఘటన
  • సీసీ కెమెరాలో రికార్డయిన ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు
  • స్పందించి దాడి చేసిన వారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు

న్యూఢిల్లీ: పొరపాటునో.. గ్రహపాటునో వేరేవార వాహనాన్ని ఢీకొట్టిన వ్యక్తిని వాహనదారులు వెంటాడి పట్టుకుని పొట్టుపొట్టు చితక్కొట్టేశారు. దారినపోయే మహిళ అడ్డగించినా వారు వినిపించుకోలేదు. పిడిగుద్దులు, ముష్టిఘాతాలే కాదు.. కర్రతో దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశ రాజధానిలో జరిగిన దారుణ ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం పోలీసుల దాకా వెళ్లింది. వారు వెంటనే బాధితుడిని కలిశారు. తనతోపాటు సంబంధం లేని తన వెంట వచ్చి బైకు వెనకాల నా వెనుక కూర్చున్న  వ్యక్తిని కూడా చితక్కొట్టారని బాధితుడు కంటతడిపెట్టుకున్నాడు. ఓ మహిళ ఎంతగా వద్దని వారించినా వినిపించుకోకుండా రాక్షసుల్లా వ్యవరించారని.. తాము లేవలేని పరిస్థితుల్లో పడిపోతే స్థానికులే స్పందించి అంబులెన్స్ ను పిలిపించి ఆస్పత్రికి తరలించారని తెలిపాడు.  అతని ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన వారి కోసం గాలింపు చేపట్టారు. అయ్యో పాపం అనిపించే ఈ ఘటనను మీరు చూసేయండి..