బోధన్, వెలుగు: మేడారం వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ కార్గో ద్వారా కేవలం రూ. 299 లకే మేడారం సమ్మక్క - సారలమ్మ ప్రసాదం ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ బి. విశ్వనాధ్ తెలిపారు. బోధన్ పట్టణంలోని డిపో కార్యాలయంలో సోమవారం సమ్మక్క- సారలమ్మ ప్రసాదం పంపిణీ పోస్టర్లను డిపో మేనేజర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ www.logistics.co.in అనే వెబ్ సైట్ ద్వారా లేదా ఆర్టీసీ కార్గో కౌంటర్ల వద్ద బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్యాకేజీలో బంగారం (బెల్లం), పసుపు, కుంకుమ, అమ్మవార్ల ఫోటో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది గిరి, రాములు, సందీప్, నవీన్ కుమార్, బోధన్ డిపో కార్గో డీఎంఈ కిశోర్ పాల్గొన్నారు.
