అక్టోబర్ 6న నుంచి అదనపు చార్జీలు

అక్టోబర్ 6న నుంచి అదనపు చార్జీలు

ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయాన్ని సమకూర్చుకోవడానికి సిటీ బస్సుల్లో అదనపు చార్జీలు విధించేందుకు ఆర్టీసీ ప్రతిపాదించగా, సెప్టెంబర్ 23న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్​ప్రెస్, ఈ- ఆర్డినరీ, ఈ -ఎక్స్​ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజీలకు రూ.5, నాలుగో స్టేజీ నుంచి రూ.10 అదనపు చార్జీ వసూలు చేయనుంది. మెట్రో డీలక్స్, ఈ -మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు చార్జీ విధించనుంది. 

రేపటి నుంచి (అక్టోబర్ 6)ఈ చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా పర్యావరణ హితమైన ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు, నగర రవాణా వ్యవస్థను గ్రీన్ జర్నీగా మార్చే ఈ చర్యలో ప్రజలు భాగస్వామ్యం కావాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆదరించాలని ఆర్టీసీ కోరుతోంది.