నిర్ణీత గడువులోగా సమాచారం ఇవ్వాలి : చంద్రశేఖర్ రెడ్డి

నిర్ణీత గడువులోగా సమాచారం ఇవ్వాలి : చంద్రశేఖర్ రెడ్డి

మెదక్,  వెలుగు: ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం పెంచడం, నిధుల వినియోగంలో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిందని ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.  మెదక్ కలెక్టరేట్‌లో మంగళవారం సమాచార హక్కు చట్టం 2005  పై జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల పౌర సమాచార అధికారుల (పీఐవో)కు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు పీవీ శ్రీనివాస్ , బోరెడ్డి అయోధ్య రెడ్డి, మోసిన్ ఫర్వీన్, వైష్ణవి మేర్ల, దేశాల భూపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ...ప్రజలు అడిగిన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా అందించాలని పౌర సమాచార అధికారులకు సూచించారు.  

ఆర్టీఐ కమిషనర్​ పీవీ శ్రీనివాస్ మాట్లాడుతూ... కారణాలు చెప్పకుండా దరఖాస్తులు తిరస్కరించొద్దన్నారు.  ఇరిగేషన్ అధికారులను ఎవరైనా సమాచారం అడిగితే  డిపార్ట్​మెంట్​రీ ఆర్గనైజేషన్ అయినందున రికార్డులు లేవని చెబుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఇది సరికాదన్నారు. ఆర్టీఐ కమిషన్ జిల్లాలు పర్యటించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మెదక్  కలెక్టర్ రాహుల్ రాజ్,  అడిషనల్ కలెక్టర్ నగేష్, అడిషనల్ ఎస్పీ మహేందర్ పాల్గొన్నారు. అంతకు ముందు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.