ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుంది : ఎమ్మెల్యే భూపతి రెడ్డి

ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుంది :  ఎమ్మెల్యే భూపతి రెడ్డి
  • రూరల్​ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

ఇందల్వాయ్​, వెలుగు : రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని, రైతులు ఆందోళన చెందొద్దని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గన్నారం సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం నిర్మాణ దశలో నిలిచిన డబుల్ బెడ్రూం ఇండ్లను, కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ అర్వింద్ ఉట్టిమాటలు చెప్పకుండా కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలన్నారు.

 ఇటీవల వరదల వల్ల రాష్ట్రంలో తీవ్ర పంట నష్టం వాటిల్లిందని, కేంద్రం ఆదుకోవాలన్నారు.  వానాకాలం సీజన్​లో 7లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం వస్తుందని అంచన ఉందని, ఇప్పటికే లక్షన్నర మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మునిపెల్లి సాయిరెడ్డి, మండలాధ్యక్షుడు  నవీన్​, బ్లాక్ కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు సంతోష్​ రెడ్డి  , లీడర్లు గంగన్న, వెంటక్ రెడ్డి, ఆనంద్​, సుధాకర్, కిషన్ గౌడ్, రాజేందర్ రెడ్డి, కరుణాకర్​ తదితరులు పాల్గొన్నారు.