రష్యాలో సేవలు నిలిపేసిన టిక్ టాక్

రష్యాలో సేవలు నిలిపేసిన టిక్ టాక్

రష్యా ఆంక్షల కారణంగా కొన్ని సోషల్ మీడియా వెబ్ సైట్లు తమ కార్యకలాపాలను రద్దు చేసుకుంటున్నాయి. తమ యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ సహా... కొత్తగా వీడియోలు చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్. ఇటీవల ప్రభుత్వం ఫేక్ న్యూస్ చట్టం తేవడంతో... ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది టిక్ టాక్. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్, యాప్ స్టోర్ ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ క్రెడిట్ కార్డు సర్వీస్ కంపెనీ.. అమెరికన్ ఎక్స్ ప్రెస్ రష్యా, బెలారస్ లో తమ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. టాప్ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కూడా రష్యాల తమ సేవలు నిలిపివేస్తున్నామంది. రష్యాలో సేవలు నిలిపివేసినట్లు ప్రకటింటింది ప్రపంచంలోనే అతి పెద్ద ఆడిటింగ్ సర్వీస్ కంపెనీ కేపీఎంజీ. ఇప్పటికే హాలీవుడ్ లోని అనేక సంస్థలు రష్యాలో తమ సేవల్నిరద్దు చేసుకుంటున్నట్లు తెలిపాయి.

 

ఇవి కూడా చదవండి

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం: జెలెన్స్కీకి మోడీ ఫోన్ కాల్ 

యుద్ధానికి మరోసారి బ్రేక్

జెలెన్స్కీ మరణిస్తే.. ఏం చేయాలన్న ప్లాన్ రెడీ