రష్యా ఆర్మీ గురించి ఫేక్ న్యూస్ రాస్తే 15ఏళ్ల జైలు శిక్ష

రష్యా ఆర్మీ గురించి ఫేక్ న్యూస్ రాస్తే 15ఏళ్ల జైలు శిక్ష
  • బిల్లుకు ఆమోదం తెలిపింది రష్యా చట్టసభ

మాస్కో: ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించి, యుద్ధ విమానాలు, మిస్సైల్ బాంబు దాడులతో విరుచుకుపడుతున్న రష్యా.. రాజధాని కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. మరో వైపు ఉక్రెయిన్ కు అండగా ప్రపంచ దేశాలన్నీ నిలుస్తుండడం..  ప్రధాన మీడియా, సోషల్ మీడియా దిగ్గజాలన్నీ తమకు వ్యతిరేకంగా నిలుస్తుండడం, ముఖ్యంగా స్వదేశీ పౌరులు నిరసనలు నిర్వహిస్తుండడంపై  ఆగ్రహంగా ఉన్న రష్యా.. విదేశీ ఆంక్షల ఎంకరేజ్ మెంట్ ను నేరంగా పరిగణించే బిల్లును రష్యా చట్టసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును రష్యా స్టే డూమా ఆమోద ముద్ర వేసింది. ఈ నేరానికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేలా చట్టం చేశారు.  రష్యా ఆర్మీ గురించి తప్పుడు సమాచారాన్ని నేరంగా భావిస్తూ.. రష్యా స్టేట్ ఆఫ్ డూమాలో బిల్లు ప్రవేశపెట్టారు. ఆర్మీపై ఫేక్ న్యూస్ రాస్తే.. 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేలా ఉన్న బిల్లుకు ఆమోదం తెలిపింది రష్యా స్టేట్ ఆఫ్ డూమా.

 

ఇవి కూడా చదవండి

కవచ్ తో రైలు ప్రమాదాల నివారణకు చెక్

ఆపరేషన్ గంగ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రశంసలు

కుక్క లేనిదే ఉక్రెయిన్ వీడనన్న ఇండియన్