కరీంనగర్లో సఫాయి కార్మికుల భద్రతపై ర్యాలీ

కరీంనగర్లో సఫాయి కార్మికుల భద్రతపై ర్యాలీ
  • సురక్షిత పద్ధతుల అమలులో దేశంలో 2వ స్థానంలో కరీంనగర్

కరీంనగర్: మురికి కాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్ సమయాల్లో సఫాయి కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరీంనగర్ లో  ర్యాలీ నిర్వహించారు. సఫాయి సురక్ష మిత్ర షహెర్ పేరుతో స్థానిక తెలంగాణ చౌక్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీ తీసారు. సఫాయి కార్మికుల ఆరోగ్య పరిరక్షణ.. పని చేసే టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి , ఆరోగ్య రక్షణపై కరీంనగర్ లో అవగాహన కల్పించేలా బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. శుభ్రత కోసం ఉపయోగించే ఆధునిక పనిముట్లు, ఉపయోగించే విధానాలు, ముందు జాగ్రత్త చర్యలపై అవగాన కల్పించే ప్రయత్నం చేశారు.  

సఫాయి కార్మికుల సురక్షిత పద్ధతుల అమలు చేస్తున్న మున్సిపాలిటీల్లో కరీంనగర్ దేశంలో రెండో స్థానంలో నిలిచిందని అధికారులు ప్రకటించారు. సెఫ్టిక్ ట్యాంక్ క్లీనింగ్ సమయాల్లో పీపీఈ కిట్లు తప్పనిసరిగా ధరించాలన్నారు. ర్యాలీలో సెఫ్టిక్ క్లీనింగ్ ట్యాంకర్లను కూడా ప్రదర్శించారు.