Samantha: చీరకట్టులో మెస్మరైజ్ చేస్తోన్న సమంత.. ఫోటోలు వైరల్.. ఫ్యాన్స్ రియాక్షన్స్ ఇవే..

Samantha: చీరకట్టులో మెస్మరైజ్ చేస్తోన్న సమంత.. ఫోటోలు వైరల్.. ఫ్యాన్స్ రియాక్షన్స్ ఇవే..

దుబాయ్లో స్టార్ హీరోయిన్ సమంత సందడి చేసింది. ఓ జ్యువెలర్ బ్రాండ్ లాంచ్ సందర్భంగా కొత్త ఫొటోలను షేర్ చేసింది. చీరకట్టులో ఆమె తళుక్కుమని మెరిసిపోయింది. సమంత అందమైన ఎంబ్రాయిడరీ వర్క్తో ఉన్న లేత పసుపు రంగు చీరలో కనిపించింది. లుక్ కోసం లేస్ డిజైన్తో సరిపోయే పసుపు రంగు బ్లౌజ్ను జత చేసి, జుట్టును విప్పి ఎడను వైపుకు విదదీసింది.

వింటేజ్ లుక్తో గ్లామర్:

సమంత తన జుట్టును మృదువైన, భారీ అలలతో స్టైల్ చేసి, ఒక వైపుకు ఊపుతూ, ఆ లుక్ కు పాత హాలీవుడ్ గ్లామర్ వైబ్ ఇచ్చింది. జుట్టు యొక్క టెక్స్చర్ మరియు బౌన్స్ చీర యొక్క సున్నితమైన ఎంబ్రాయిడరీని కప్పివేయకుండా కంప్లీట్ న్యూ స్టైల్ ను తీసుకొచ్చింది. 

►ALSO READ | Thug Life: ఇండియన్ 2ను అధిగమించని థగ్ లైఫ్.. కమల్ హాసన్ సినిమాకు తొలిరోజు వసూళ్లు ఎంతంటే?

మరో ఫొటోలో హోటల్ గది బాల్కనీలో సమంత ఆమె ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. ఈ ఫొటోలు సోషల్ మీడియలో తెగ వైరల్ గా మారాయి. ఆమె లుక్ నచ్చి చీరకట్టులో ఎంత అందంగా ఉందో అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మరో ఫొటోలో జ్యువెలరీ బ్రాండ్ నుంచి సర్టిఫికేట్ అఫ్ ప్రజెంటేషన్'గా బహుమతిగా ఇచ్చిన జ్ఞాపికను ఆమె పట్టుకుంది. ఈ ఫొటోలపై స్పందించిన ఓ అభిమాని 'నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది సామ్! సువ్వు ఎదగడం చూడటం చాలా ఆనందంగా ఉంది' అని ట్వీట్ చేశాడు. 'ఎప్పటికీ ఫేవరెట్. చాలా క్యూట్గా ఉంది' అని మరో అభిమాని కామెంట్ చేశాడు.

ఇదిలా ఉండగా సమంత ఇటీవలే ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ ను ప్రారంభించి నిర్మాతగా మారింది. ఈ బ్యానర్ పై శుభం టైటిల్ తో ఫస్ట్ సినిమాను రిలీజ్ చేసింది. మే 9, 2025న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ జూన్ 13 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం సమంత రాజ్ అండ్ డీకే 'రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్ డమ్', అలాగే తన సొంత బ్యానర్ లో 'మా ఇంటి బంగారం' సినిమాలు చేస్తోంది.