ఫిఫా వరల్డ్ కప్: సౌదీ ఆటగాళ్లకు బంపర్ ఆఫర్

ఫిఫా వరల్డ్ కప్: సౌదీ ఆటగాళ్లకు బంపర్ ఆఫర్

ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనాను ఓడించి సంచలనం సృష్టించిన సౌదీ అరేబియా ప్లేయర్లకు సూపర్ గా కలిసొచ్చింది. సూపర్ స్టార్ లాంటి అర్జెంటీనా టీమ్ ను ఓడించటంతో... సౌదీలో ఏకంగా రోజంతా సంబురాలు జరుపుకొన్నారు. ఒక రోజు అధికారిక సెలవు ప్రకటించారు. దీనికి తోడు సౌదీ అరేబియా ఆటగాళ్లకు మరో బంపరాఫర్  తగిలింది. అర్జెంటీనాపై గెలిచినందుకు జట్టులోని ఒక్కో ఆటగాడికి ఖరీదైన రోల్స్ రాయిస్ కారును గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు రోల్స్ రాయిస్ సంస్థ ప్రకటించింది. అర్జెంటీనాపై గెలిస్తే ఆటగాళ్ళకు రోల్స్ రాయిస్ కారును గిప్ట్ గా ఇస్తానని సౌదీ యువరాజు, ప్రధానమంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ గతంలోనే మాట ఇచ్చారు.

సౌదీ రాజు మాట నిలబెట్టుకుంటూ ఆటగాళ్లందరికి రోల్స్ రాయిస్ కారును బహుమతిగా అందజేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇక రోల్స్ రాయిస్ ఒక్క కారు ఖరీదు ఐదు లక్షల యూరోలు అంటే ఇండియన్  కరెన్సీలో 4 కోట్లకుపై మాటే. అయితే సౌదీ అరేబియా ఫుట్ బాల్ జట్టుకు ఇలాంటి గిఫ్ట్ లు రావడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ 1994 వరల్డ్ కప్ లో బెల్జియంను 1–0తో ఓడించినప్పుడు.. అప్పటి మ్యాచ్ లో గోల్ తో జట్టును గెలిపించిన సయీద్ అల్ ఒవైరన్ కు లగ్జరీ కారును బహుమతిగా అందజేశారు.