సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు స్వల్ప అస్వస్థత

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు స్వల్ప అస్వస్థత

సికింద్రాబాద్: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం తన ఇంట్లో కాలు జారిపడిన ఆయన నిన్న రాత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆస్పత్రిలో చికిత్సతో కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత రెండేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2019లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ , మహర్షి సినిమాలు చేసిన తర్వాత ఎలాంటి సినిమాలు చేయలేదు. గత ఏడాది మార్చిలో కరోనా ప్రబలడంతో అప్పటి నుంచి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.