కరీంనగర్ సిటీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జిల్లా వక్ఫ్ బోర్డు ప్రొటెక్షన్ అండ్ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ సమద్ నవాబ్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు. బుధవారం సమద్ నవాబ్ అంత్యక్రియలు నిర్వహించగా మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు కుటుంబాలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి పరామర్శించారు.
మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ తండ్రి మెండి శంకరయ్య ఇటీవల అనారోగ్యంతో చనిపోగా.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కాంగ్రెస్ మహిళా నేత అవాలా సరోజమ్మ ఇటీవల చనిపోగా.. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారితోపాటు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

