సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారి జాతకం వివరాలు

సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారి జాతకం వివరాలు

సెప్టెంబర్ మాసంలోనే లక్ష్మీ నారాయణ యోగం ప్రారంభమవుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. సెప్టెంబర్  నెల ఆంగ్ల క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. గ్రహాలు, నక్షత్రాల కదలికల ప్రకారం సెప్టెంబర్ నెల చాలా ముఖ్యమైనదట సంఖ్యా శాస్త్ర నిపుణులు అంటున్నారు. . ఈ నెలలో చాలా గ్రహాలు తమ రాశులను మార్చుకుంటున్నాయి, దీని కారణంగా ఇది కచ్చితంగా 12 రాశులను ప్రభావితం చేస్తుంది. వేద జ్యోతిష్య గణనల ప్రకారం సెప్టెంబర్ నెల ఏ రాశి వారికి   ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. 
 

మేషరాశి : ఈ రాశి వారు తమ సమయాన్ని, శక్తిని, సంబంధ బాంధవ్యాలను సక్రమంగా వినియోగించుకుంటే సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి జీవిత సంబంధిత సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందంటున్నారు పండితులు . అయితే మీరు ఆశించిన విజయాన్ని సాధించడానికి మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుందని చెబుతున్నారు.  సెప్టెంబరు మొదటి వారంలో ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా సెప్టెంబర్ నెల మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. 

వృషభ రాశి : ఈ రాశి వారికి సెప్టెంబర్ నెల సానుకూల మార్పులతో ప్రారంభమవుతుందట. ఉద్యోగస్తులకు కోరుకున్న స్థానచలనం లేదా ఉద్యోగ మార్పు నెరవేరవచ్చని జ్యోతిష్కులు చెబుతున్నారు.  వృత్తి ,  వ్యాపారంలో ఊహించని  మార్పులు కలుగుతాయంటున్నారు పండితులు. కొత్త వ్యక్తులతో పరిచయం  ఏర్పడి ... అది ఆదాయం పెరిగే వనరుగా మారుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని  విలాస వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 

మిథున రాశి:  మిథునరాశి వారికి సెప్టెంబర్‌లో కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయట. ఈనెలలో అందరి మన్ననలు పొందుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.  దీంతో అందరితో కలిసి  సామరస్యంగా పని చేయడానికి అనుకూలమైన సమయమంటున్నారు.  అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తికావడంతో ..  విజయాన్ని చాలా సులభంగా పొందుతారని పండితులు అంటున్నారు. 

కర్కాటక రాశి: సెప్టెంబరు నెలలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు  ఉండవచ్చని పండితులు అంటున్నారు.  పూర్వీకుల ఆస్తి వివాదాలను పరిష్కరించడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుందని చెబుతున్నారు. . ఉద్యోగులు అదనపు పనిభారంతో కొంత  శారీరకంగా , మానసికంగా అలసిపోతారని జ్యోతిష్కులు అంటున్నారు. 

సింహరాశి: ఈ రాశి వారికి సెప్టెంబర్ నెల మిశ్రమంగా ఉంటుందట.  అయితే గడిచిన నెల కంటే బాగుంటుంది. కేరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయంటున్నారు జ్యోతిష్కులు .  వృత్తి, ఉద్యోగాల్లో కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయని  పండితులు చెబుతున్నారు.  అయితే మీ ఆదాయ వనరులు స్థిరంగా ఉండటంతో... . కుటుంబ జీవితం సాధారణంగా సాగిపోతుందట. అయితే  సింహరాశి వారు సెప్టెంబర్ నెలలో బయటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. 

కన్య రాశి: సెప్టెంబర్ నెల ఈ రాశి వారికి అదృష్టం కలిగిస్తుందట.  సెప్టెంబర్ నెలలో  మీరు చేసే పనిలో ఏదైనా కొత్త  డీల్‌ కుదుర్చుకకన్నట్లయితు అది మీకు లాభంగా ఉంటుందని పండితులు అంటున్నారు.  కెరీర్ , వ్యాపార విషయంలో  అనుకూలంగా ఉండి... స్నేహితుల సహకారంతో చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారని జ్యోతిష్య గ్రంధాలు చెబుతున్నాయని జ్యోతిష్కులు అంటున్నారు. విదేశాల్లో వ్యాపారం చేసే వారికి  ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.

తులారాశి: ఈ రాశికి చెందిన వారు సెప్టెంబర్ నెలలో పనిలో భాగంగా తిరగవలసి ఉంటుందట.   మీరు మీ ఆలోచనలను మార్చుకొనేందుకు  అన్ని ప్రయత్నాలు చేస్తారట.  అయితే  మీరు తీసుకున్న నిర్ణయం వలన  సంతోషకరమైన ఫలితాలను కలుగుతాయని అంటున్నారు.  ఉద్యోగస్తులకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడి.. సంపద పోగుపడుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. 

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి సెప్టెంబర్‌లో గణనీయమైన ప్రయోజనాలను కలుగుతాయని పండితులు అంటున్నారు. ఉద్యోగులు తమ పనిని సమయానికి మరియు మెరుగైన మార్గంలో చేయడానికి అదనంగా కష్టపడి పనిచేయవలసి ఉంటుందట. ఈ సమయంలో అదనపు పని కారణంగా మీరు కొంచెం ఒత్తిడికి గురవుతారు. అయినా చివరకు మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.  ఇతరులతో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి సెప్టెంబరు అద్భుతమైన  నెలగా ఉండబోతోందని పండితులు అంటున్నారు. ఈ మీ పని ...  మీ కష్టానికి సంబంధించిన ఫలితాలపై సంతృప్తి చెందుతారట.  మీరు చేసే వృత్తిలో ఆత్మగౌరవం పెరిగి..   మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారని జ్యోతిష్య నిపుణులు  అంటున్నారు.  ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందంటూ... .  కొన్ని కొత్త విషయాలు నేర్చుకొనే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

మకర రాశి : సెప్టెంబర్ నెల  మకరరాశి వారికి మిశ్రమ ప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. మీరు అనుకున్న పని సమయానికి పూర్తి కావడంతో ఉన్నతాధికారులనుంచి ప్రశంసలు పొందుతారని అంటున్నారు. మీరు మీ కార్యాలయంలో మీ పని ద్వారా మీ సీనియర్లను ఆకట్టుకుంటారట. మీరు రూపొందించిన ప్రాజెక్ట్‌లకు ప్రశంసలు దక్కుతాయని జ్యోతిష్య నిపుఫులు అంటున్నారు. సెప్టె్ంబర్ నెలలో ప్రమోషన్ కు అవకాశం ఉండటంతో  భవిష్యత్తు ప్రణాళికలపై  దృష్టి పెట్టాలని పండితులు సూచిస్తున్నారు. 

కుంభరాశి : ఈ రాశి వారికి సెప్టెంబరు ప్రథమార్ధం ద్వితీయార్ధం కంటే శుభప్రదంగా ఉంటుందట. ఉద్యోగస్తులకు అనుకూల సయమే కాని... కెరీర్ లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయని పండితులు అటున్నారు.  అయినా చివరిలో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారట.  దీంతో అప్పటివరకు మిమ్మలను ద్వేషించిన సీనియర్లు మిమ్మలను అభినందించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. సెప్టెంబర్ నెలలో కుంభరాశివారు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

మీనరాశి :  సెప్టెంబర్ నెలను మీనరాశి వారికి అదృష్ట నెలగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అధిక లాభం కలుగుతుందట.  సమాజంలో గౌరవం పెరిగి... ఆనందంతో గడుపుతారట.  గతంలో ఉన్న  ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని పండితులు అంటున్నారు. మహిళలు విలాస వంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారని జ్యోతిష్కులు అంటున్నారు.