Inimel Musical Promo: శృతి హాసన్‌తో లోకేష్ రొమాన్స్ పీక్స్..సాంగ్ కాదు..సినిమా కావాలి

Inimel Musical Promo: శృతి హాసన్‌తో లోకేష్ రొమాన్స్ పీక్స్..సాంగ్ కాదు..సినిమా కావాలి

విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఒక ఆసక్తికరమైన కాంబోని సెట్ చేశాడు. ఒకవైపు హీరోగా రాణిస్తూనే నిర్మాణంలోను తనదైన సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్గా ఆర్‌కేఎఫ్ఐ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ థోమ్ కలిసి కమల్ హాసన్ మ్యూజిక్ వీడియో ఇనిమెల్ (Inimel Music Video)ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

అయితే ఇక్కడ అదిరిపోయే స్పెషాలిటీ ఏంటంటే..ఈ మ్యూజిక్ వీడియోలో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) హీరోగా, శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ ఇనిమెల్ మ్యూజిక్ వీడియోలో యాక్టర్గా లోకేష్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. అంతే అని చెప్పలేము..లోకేష్, శృతి రెచ్చిపోయి నటించినట్లు ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది.

లేటెస్ట్ గా రిలీజ్ చేసిన 18 సెకన్ల ప్రోమోలో మ్యూజిక్ బీట్ పెద్దగా లేకపోయినా..శృతి హాసన్ తో రొమాన్స్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా ఉంది. ఈ ఇనిమేల్ ఫుల్ సాంగ్ తెలుగు, తమిళ భాషల్లో మార్చి 25న రిలీజ్ కానుంది. దీంతో 'అదిరిపోయింది కాంబో..కేవలం సాంగ్ మాత్రమే కాదు..సినిమా కావాలి' అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ మ్యూజిక్ వీడియోకి శ్రుతి హాసన్ మ్యూజిక్ తో పాటు కాన్సెప్ట్ సైతం అందించారట. ఇనిమెల్‌కు కమల్ హాసన్ లిరిక్ రైటర్ గా పనిచేశాడు.ఇలా అనేక ప్రత్యేకతలతో ఈ మ్యూజిక్ వీడియో రాబోతుంది. మరి ఇన్ని రకాల వెరైటీస్ తో రాబోతున్న ఆల్బమ్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలున్నాయి.ఈ మ్యూజిక్ వీడియోకు ద్వారకేష్ ప్రభాకర్ డైరెక్ట్ చేస్తున్నారు. 

కమల్ హాసన్, శృతి హాసన్, లోకేష్ తమ తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి మ్యూజిక్ వీడియోని తీసుకొస్తున్నారంటే..ఏదో స్పెషల్ ఉండే ఉంటుందని తెలుగు తమిళ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. మరి ఎలా ఉంటుందో చూడాలి.