36 శాతం పెరిగిన ఎస్ఈఐఎల్ లాభం

36 శాతం పెరిగిన ఎస్ఈఐఎల్ లాభం

న్యూడిల్లీ: సీమెన్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ (ఎస్​ఈఐఎల్​) నికర లాభం ఈ ఏడాది -మార్చి క్వార్టర్​లో ఏడాది లెక్కన 36.34 శాతం పెరిగి రూ.246.1 కోట్లకు చేరింది. విద్యుత్ పంపిణీ,  ఉత్పత్తి విభాగం నుంచి భారీగా ఆదాయం వచ్చిందని కంపెనీ తెలిపింది. గత సంవత్సరం రెండవ క్వార్టర్​లో కంపెనీ రూ.180.5 కోట్ల లాభాన్ని ప్రకటించింది.  

కంపెనీ అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. మార్చి క్వార్టర్​లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.1,893.9 కోట్లకు చేరుకుంది.