మందమర్రి ఏరియా జీఎంగా రాధాకృష్ణ

మందమర్రి ఏరియా జీఎంగా రాధాకృష్ణ
  • సింగరేణిలో పలువురు జీఎంల బదిలీ

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా సింగరేణి కొత్త జీఎంగా ఎన్.రాధాకృష్ణను నియమిస్తూ  యాజమాన్యం శనివారం ఆదేశాలు జారీ చేసింది. సింగరేణి వ్యాప్తంగా పలువురు జీఎంలను బదిలీ చేసింది. ప్రస్తుతం కార్పొరేట్​ఎస్టేట్​ జీఎంగా కొనసాగుతున్న రాధాకృష్ణను మందమర్రికి ట్రాన్స్​ఫర్​ చేసింది. ఇక్కడ జీఎంగా పనిచేస్తున్న జి.దేవేందర్ 45 రోజుల పాటు సెలవులపై విదేశాలకు వెళ్లనుండడంతో ఏరియాకు కొత్త జీఎంను నియమించారు.

 రామగుండం రీజియన్​ క్వాలిటీ జీఎం దెబ్దులాల్​ బైధ్యను ఒడిశాలోని నైనీ ఏరియాకు, నైనీ ఏరియా జీఎం సూజోయ్​ మజుమేందర్​ను రామగుండం రీజియన్​క్వాలిటీ జీఎంగా బదిలీ చేసింది. మణుగూరు ఏరియా పీకే ఓసీపీ అడిషనల్​ జీఎం టి.లక్ష్మీపతిగౌడ్​ను కార్పొరేట్ ​ఎస్టేట్​హెచ్​ఓడీగా నియమిస్తూ బదిలీ చేసింది.