
- రంగారెడ్డి జిల్లా మంచాలలో ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: తాగడానికి పైసలు ఇయ్యలేదని ఓ కొడుకు తన తల్లిని దారుణంగా హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మానుపాటి ఐలమ్మ(50)కు కొడుకు శ్రీకాంత్ ఉన్నాడు. శుక్రవారం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తన తల్లితో శ్రీకాంత్ గొడవ పడ్డాడు. అనంతరం అర్ధరాత్రి తర్వాత ఇంటికి బాగా తాగొచ్చి మద్యం మత్తులో మళ్లీ గొడవకు దిగాడు.
ఈ క్రమంలో పదునైన ఇనుప వస్తువుతో తల్లి తలపై కొట్టాడు. ఆపై అదే వస్తువుతో మెడలో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ మేరకు ఐలమ్మ భర్త సోమయ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.