
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : సీఎంఆర్ డెలివరీ స్పీడప్ చేయాలని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ మిల్లర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో డీఎస్వో శ్రీనివాస్ తో కలిసి రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతు సీఎంఆర్ కింద మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి వెంటనే అప్పగించాలన్నారు.
పౌరసరఫరాల శాఖ, డిప్యూటీ తహసీల్దార్లు రైస్ మిల్లులను తనిఖీ చేసి బియ్యం డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ రాజీవ్ రెడ్డి, రైస్ మిల్లర్ల యూనియన్ నాయకులు, మిల్లర్లు పాల్గొన్నారు.