గ్రామీణ ప్రయాణికుల కోసం సోనూ సూద్ 'ట్రావెల్ యూనియన్' 

గ్రామీణ ప్రయాణికుల కోసం సోనూ సూద్ 'ట్రావెల్ యూనియన్' 

కరోనా సంక్షోభ సమయంలో ఎంతో మంది బాధితులకు తన వంతుగా సాయం చేసి ఆదుకున్నాడు నటుడు సోనూ సూద్. ఇప్పుడు గ్రామీణ ప్రయాణికులపై దృష్టి సారించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ట్రావెల్ యూనియన్ ప్లాట్ ఫాంను ప్రారంభించాడు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఉండే ఈ ప్లాట్ ఫాం త్వరలోనే మరో 11 భారతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది. విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలు, ప్రైవేట్ ట్రావెల్స్, టూరిస్ట్ బస్ సర్వీసులు, హోటల్ సదుపాయాలను ఈ వేదిక ద్వారా గ్రామీణ వినియోగదారులు పొందవచ్చు.

నగరాల్లోని ట్రావెల్ ఏజెన్సీలను, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ట్రావెల్ ఏజెన్సీలను ఈ ట్రావెల్ యూనియన్ వేదిక ద్వారా అనుసంధానం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థలు సరిగా లేకుండా ఉండటాన్ని గుర్తించిన సోనూ సూద్.. ఆయా ట్రావెల్ ఏజెన్సీల భాగస్వామ్యంతో ఈ వేదికను తీసుకువచ్చారు.