
సౌత్ ఫేస్ వాకిలికి బాత్ రూం ఏ దిక్కులో ఉండాలి.. రెండు దిక్కుల్లో ఉన్న ఇంటి వరండాను ఎలా నిర్మించుకోవాలి. వరండాను పూర్తిగా క్లోజ్ చేయాలా.. చేయకపోతే వాస్తు ప్రకారం ఏమైనా దోషాలున్నాయి. ఈ విషయాల్లో వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారి సూచనలను తెలుసుకుందాం..
ప్రశ్న: మాది దక్షిణం వాకిలి ఇల్లు, ఉత్తర వాయువ్యంలో ఒక బాత్ రూం ఉంది.. పడమరలో దక్షిణం వైపు బెడ్రూం ఉంది. అటాచ్డ్ బాత్రూం ఏ వైపు కట్టుకుంటే మంచిది? వెంటిలేటర్ ఎటువైపు ఉండాలి?
జవాబు: బెడ్ రూంకు వాయువ్యంలో లేదా ఆగ్నేయంలో బాత్రూం కట్టుకోండి. బాత్రూం డోర్ కూడా వాయువ్య దిక్కులో ఉండేలా పెట్టుకోవాలి. వెంటిలేటర్ ఎటువైపు అయినా పెట్టుకోవచ్చు. రోడ్డును బట్టి, గాలి వెలుతురు వచ్చేలా చూసుకుని కట్టుకోండి.
వరండా క్లోజ్ చేయాలా?
ప్రశ్న: మా ఇంటికి పడమర, ఉత్తరం దిక్కుల్లో రోడ్లున్నాయి. మలుపు అర్ధచంద్రాకారంలో ఉండటం వల్ల వరండా, డోర్ అలాగే కట్టుకున్నాం.. ఆ డోర్ నుంచి నడవకూడదని సిద్దాంతి చెప్పారు. డోర్ పక్కకు మార్చాం. ఇప్పుడు పూర్తిగా గోడ కట్టుకోమంటున్నారు. సలహా ఇవ్వండి?
ALSO READ: Vastu Tips : ఇంట్లో అటకలు ఏ దిక్కులో ఉండాలి.. ఆ రెండు గదుల మధ్య డోర్ పెట్టుకోవచ్చా..?
జవాబు: రోడ్ మలుపు గుండ్రంగా ఉందని వరండా అలా కట్టుకోకూడదు. డోర్ పక్కకు మార్చుకున్నా, అది పడమర నైరుతిలో ఉంటే మంచిది కాదు. వాస్తు ప్రకారం పడమర వాయువ్యంలో డోర్ పెట్టుకోవాలి. వరండా మొత్తం క్లోజ్ చేస్తూ, రోడ్డు కనపడకుండా గోడ కట్టుకోండి. అప్పుడు రోడ్డు మలుపు ప్రభావం మీ ఇంటిపై పడదని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ అంటున్నారు.