ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి : ఎస్పీ నరసింహ

ట్రాఫిక్ సమస్యల  పరిష్కారానికి కృషి : ఎస్పీ నరసింహ
  • ఎస్పీ నరసింహ

సూర్యాపేట, వెలుగు: ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ప్రజలు కూడా సహకరించాలని ఎస్పీ నరసింహ కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పొట్టిశ్రీరాములు సెంటర్, రాఘవ ప్లాజా, వాణిజ్య భవన్ సెంటర్​లో శుక్రవారం రాత్రి ట్రాఫిక్ పరిస్థితి, రోడ్లపై దుకాణాలు, వ్యాపారాలను పరిశీలించారు. 

వాహనదారులకు ఇబ్బంది, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వ్యాపారాలు నిర్వహించుకునేలా చూడాలని పోలీస్​సిబ్బందికి సూచించారు. వ్యాపారులు రోడ్లను ఆక్రమించొద్దని చెప్పారు. ట్రాఫిక్ ఎస్సై సాయిరాం, సిబ్బంది ఉన్నారు.