మద్యం తాగి వెహికల్ నడుపొద్దు : ఎస్పీ రాజేశ్చంద్ర

మద్యం తాగి వెహికల్ నడుపొద్దు : ఎస్పీ రాజేశ్చంద్ర
  • ఎస్పీ రాజేశ్​చంద్ర
  • హైవేపై పోలీసుల విస్తృత తనిఖీలు
  • మద్యం సేవించి వెహికల్స్​ నడిపిన 27 మందిపై కేసు, ప్రైవేట్ బస్సు సీజ్​

కామారెడ్డి, వెలుగు : మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజేశ్​చంద్ర పేర్కొన్నారు. గురువారం రాత్రి జిల్లాలోని హైవేపై విస్తృత తనిఖీలు చేపట్టారు. భిక్కనూరు మండల కేంద్రానికి సమీపంలో  హైవే 44 టోల్​ప్లాజా వద్ద  భిక్కనూరు సీఐ సంపత్​కుమార్​ ఆధ్వర్యంలో 8 టీమ్స్ తనిఖీల్లో పాల్గొన్నాయి.

 1,139 వెహికల్స్ నడిపే వారికి డ్రంక్​ అండ్​ డ్రైవ్​ టెస్టులు చేశారు.  27 మంది మద్యం తాగగా కేసులు నమోదు చేశారు.  ఓ ప్రైవేట్ ట్రావెల్స్​ బస్సు 45 మంది ప్రయాణికులతో వెళ్తుండగా, డ్రైవర్ మద్యం సేవించినట్లు గుర్తించారు. బస్సును సీజ్​ చేసి డ్రైవర్​ను అరెస్టు చేశారు.  మరో బస్సులో ప్రయాణికులను పంపారు.