V6 News

భద్రకాళి బ్రహ్మోత్సవాలు..

 భద్రకాళి బ్రహ్మోత్సవాలు..

కాశీబుగ్గ, వెలుగు: భద్రకాళి అమ్మవారి కల్యాణ బ్రహోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ- రాజేశ్వరరావు దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను చేశారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు, మహిళలు, భక్తులు తదితరులున్నారు.