అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా

అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా

సూర్యాపేట, వెలుగు : రైతులకు అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో నానో యూరియా, నానో డీఏవోను  డ్రోన్ ద్వారా పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నానో యూరియాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.

 దీనిపై రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. సాంప్రదాయ యూరియా వాడటం వల్ల  పర్యవరణ  కాలుష్యం, భూగర్భ జల వనరులకు ఇబ్బంది కలగడమే కాకుండా నేలకు చాలా నష్టం జరుగుతుందన్నారు. కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్, ఏఈవో సుష్మ తదితరులు పాల్గొన్నారు.