ఎంబోలో గోల్‌తో కామెరూన్​పై స్విట్జర్లాండ్​ గెలుపు

ఎంబోలో  గోల్‌తో కామెరూన్​పై స్విట్జర్లాండ్​ గెలుపు

అల్‌ వాక్రా (ఖతార్‌):  ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో గోల్‌ కొట్టిన వెంటనే ప్లేయర్లు తమదైన స్టయిల్లో సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఫిఫా వరల్డ్‌ కప్‌లో గోల్‌ చేస్తే వాళ్ల ఆనందానికి హద్దే ఉండదు. కానీ, స్విట్జర్లాండ్‌ ప్లేయర్ బ్రీల్‌ ఎంబోలో గోల్‌ చేసినా ఎలాంటి సెలబ్రేషన్ సైలెంట్​గా ఉండిపోయాడు. బాల్‌ను నెట్‌లోకి పంపిన తర్వాత ఏదో కోల్పోయినట్టుగా నిశ్శబ్దంగా నిల్చున్నాడు. గురువారం జరిగిన గ్రూప్‌–జి పోరులో అతను చేసిన ఏకైక గోల్‌తో స్విట్జర్లాండ్‌ 1–0తో కామెరూన్‌ను ఓడించింది.

48వ నిమిషంలో జెడ్రన్‌ షారికి నుంచి లో పాస్‌ అందుకున్న స్విస్‌ ఫార్వర్డ్‌ ఎంబోలో షాట్‌ కొట్టి జట్టును గెలిపించాడు. అయితే, తాను పుట్టిన దేశమైన కామెరూన్‌పై గోల్‌ చేస్తే సెలబ్రేట్‌ చేసుకోనని టోర్నీకి ముందే చెప్పాడు. ఆ  మాటకు ఎంబోలో  కట్టుబడ్డాడు. గోల్‌ కొట్టిన తర్వాత  స్విస్‌ ఆటగాళ్లంతా సంబరాల్లో తేలిపోగా.. తాను మాత్రం రెండు చేతులు పైకెత్తి సైలెంట్‌గా నిల్చున్నాడు. బ్రీల్‌కు ఐదేళ్లు ఉన్నప్పుడు అతని ఫ్యామిలీ కామెరూన్‌ను వీడి స్విట్జర్లాండ్‌తో స్థిరపడింది.