డేంజర్ మార్క్‌ను దాటిన యమునా నది.. దేనికైనా రెడీ అంటున్న ప్రభుత్వం

డేంజర్ మార్క్‌ను దాటిన  యమునా నది.. దేనికైనా రెడీ అంటున్న ప్రభుత్వం

హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో యమునా నదిలో నీటి మట్టం మళ్లీ ఢిల్లీలో ప్రమాద స్థాయిని దాటింది. ఈ ఉదయం 9 గంటలకు నదిలో 205.96 మీటర్ల మేర ప్రవహిస్తోంది. సాయంత్రానికి ఇది 206.7 మీటర్లకు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

హర్యానా నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం వరద పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోందని మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అతిషి ఇటీవలే చెప్పారు. యమునా నది వారం రోజుల నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇది దేశ రాజధానిలోని అనేక ప్రాంతాల్లో వరదలకు దారితీసింది. నీటి మట్టం క్రమంగా పెరగడానికి ప్రధాన కారణం హర్యానా బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడమే.

హిమాచల్‌లో రుతుపవనాల ప్రభావంతో బ్యారేజీకి భారీ ఎత్తున నీరు చేరింది. నీటి మట్టం 206.7 మీటర్లకు మించి పెరిగితే యమునా ఖాదర్‌లోని కొన్ని ప్రాంతాలు వరదలకు గురవుతాయని అధికారులు ఇంతకు మునుపే తెలిపారు. "దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది" కూడా స్పష్టం చేశారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. పరిస్థితిని సమర్ధవంతంగా పరిష్కరించడానికి రెవెన్యూ శాఖ విస్తృతమైన చర్యలు తీసుకుంది. అది సెంట్రల్ జిల్లా, తూర్పు జిల్లా, యమునా బజార్, యమునా ఖాదర్ వంటి ప్రాంతాలు అయినా, తలెత్తే ఏవైనా సవాళ్లను పరిష్కరించడానికి తాము తగిన సన్నాహాలు చేసాం" అని మంత్రి చెప్పారు.

 యమునా నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతుండడంతో.. ఇప్పటికే నది నీరు రహదారులపై చేరి వరదలను సృష్టించింది. దీని వల్ల అనేక కుటుంబాలను నిరాశ్రయులయ్యారు. భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. వరద ధాటికి దేశ రాజధానిలో పలు ప్రసిద్ధ ప్రాంతాల్లోనూ వరద బీభత్సం సృష్టించింది. ఇప్పటికే ఎర్రకోటతో పాటు రద్దీగా ఉండే ITO కూడలిలోనూ వరద నీరు చేరుకోవడం జనజీవనానికి తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.