
ఇంచోన్: వ్యవసాయ రంగ సబ్సిడీలను డబ్ల్యూటీవో ఓపెన్ మైండ్‌తో చూడాలని, ఎందుకంటే ఈ అంశం ఆహార భద్రత (ఫుడ్ సెక్యూరిటీ)తో ముడిపడి ఉన్నదని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చెప్పారు. కొవిడ్మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎమర్జింగ్ ఎకానమీల ఆహార భద్రతపై వ్యవసాయ సబ్సిడీల నిర్ణయం ఎఫెక్ట్ పడుతుందని పేర్కొన్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిర్వహించిన సెమినార్లో ఆసియా దేశాల రికవరీ అనే అంశంపై నిర్మలా సీతారామన్ మాట్లాడారు.
డబ్ల్యూటీవో ఎంత తొందరగా పరిష్కారం కనుక్కుంటే ప్రపంచానికి అంతే తొందరగా మేలు జరుగుతుందని అన్నారు. వ్యవసాయ రంగ సబ్సిడీలపై సమస్యలు డబ్ల్యూటీవో ఏర్పాటయిన నాటి నుంచీ ఉన్నాయని ఫైనాన్స్ మినిస్టర్ గుర్తు చేశారు. ఈ విషయంలో పెద్ద దేశాల మాటకు ఇచ్చిన విలువను గ్లోబల్ సౌత్ దేశాల మాటకు ఇవ్వడం లేదని విమర్శించారు. ఆసియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా దేశాలను కలిపి గ్లోబల్సౌత్గా వ్యవహరిస్తున్నారు. డెవలపింగ్ ఎకానమీలలోని పేద రైతులకు ఇచ్చే వ్యవసాయ సబ్సిడీలను లెక్కించడమే లేదని, తాజా పరిణామాల నేపథ్యంలో ఫుడ్, ఫెర్టిలైజర్ సెక్యూరిటీలు రెండూ చాలా ఇంపార్టెంట్‌గా మారాయని నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.
ఫుడ్, ఫెర్టిలైజర్ సబ్సిడీలపై మరోసారి కూలంకషంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఫుడ్ సెక్యూరిటీ మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. ట్రేడ్ ఎగ్రిమెంట్లు ఒకే వైపు నడుస్తున్నాయని, దీనికి సొల్యూషన్ కనుక్కోవాలని సూచించారు. ఫుడ్ సబ్సిడీ లెక్కించే విధానంలో కొన్ని మార్పులు కావాలని డబ్ల్యూటీవోను ఇండియా చాలా కాలంగా కోరుతున్న విషయం తెలిసిందే.