వాగు దాటుతుండగా ఆగిన ట్రాక్టర్‌‌‌‌.. చిక్కుకున్న టీచర్లు

వాగు దాటుతుండగా ఆగిన ట్రాక్టర్‌‌‌‌.. చిక్కుకున్న టీచర్లు

వీర్నపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీకి  వెళ్లేందుకు తుకమర్రి వాగు దాటాల్సిందే. దీంతో టీచర్లు, విద్యార్థులు వాగు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

శుక్రవారం స్కూల్‌‌ అయిపోయాక ఇంటికి వస్తున్న టీచర్లు వాగు దాటేందుకు ట్రాక్టర్ ఎక్కారు. కాగా ట్రాక్టర్‌‌‌‌ మధ్యలోనే ఆగిపోగా అందులోనే ఉండిపోయారు. ఎస్సై లక్ష్మణ్, పోలీసులు, గ్రామ యువకుల సహకారంతో ట్రాక్టర్‌‌‌‌ను జేసీబీతో బయటకు తీశారు. - వీర్నపల్లి, వెలుగు