డబ్ల్యూటీసీకి టీమిండియా పక్కా ప్లాన్

డబ్ల్యూటీసీకి టీమిండియా పక్కా ప్లాన్

టీమిండియాకు 18 రోజుల క్వారంటైన్​
ఇండియాలో 8 రోజులు  మిగిలింది యూకేలో
ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌కు అనుమతి

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌ (డబ్ల్యూటీసీ) కోసం టీమిండియా ప్రిపరేషన్స్‌‌‌‌ షురూ చేస్తోంది. ఓవైపు కరోనా భయం వెంటాడుతున్నా.. మరోవైపు ప్లేయర్ల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఐపీఎల్‌‌‌‌ మాదిరిగా కాకుండా ఈసారి అత్యంత కట్టుదిట్టమైన, సురక్షితమైన బయో సెక్యూర్‌‌‌‌ బబుల్‌‌‌‌ను క్రియేట్‌‌‌‌ చేయనుంది. మొత్తం 18 రోజుల పాటు ఉండే ఈ బబుల్‌‌‌‌ను రెండు భాగాలుగా విడగొట్టారు. ఇండియాలో 8 రోజులు, యూకేలో 10 రోజుల పాటు క్రికెటర్లందరూ హార్డ్‌‌‌‌ క్వారంటైన్‌‌‌‌లో ఉండే విధంగా ప్లాన్‌‌‌‌ చేసింది. జూన్‌‌‌‌ 18న సౌతాంప్టాన్‌‌‌‌లో ఇండియా, న్యూజిలాండ్‌‌‌‌ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్స్‌‌‌‌తో విరాట్‌‌‌‌సేన ఇంగ్లండ్‌‌‌‌ టూర్‌‌‌‌ మొదలవుతుంది. ఆ తర్వాత ఆగస్ట్‌‌‌‌ 4 నుంచి ఇంగ్లండ్‌‌‌‌తో ఐదు మ్యాచ్‌‌‌‌ల టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌ ఆడనుంది. ఈ లాంగ్​ టూర్​ కోసం కోహ్లీసేన మే 25న బయో బబుల్‌‌‌‌లోకి ఎంటర్‌‌‌‌ కానుంది. ఇండియాలో ఎనిమిది రోజుల తర్వాత జూన్‌‌‌‌ 2న సౌతాంప్టన్‌‌‌‌కు చేరుకుంటుంది. అక్కడ పది రోజుల పాటు క్వారంటైన్‌‌‌‌లో ఉంటుంది. అయితే బబుల్‌‌‌‌ టు బబుల్‌‌‌‌లోకి ఎంటర్‌‌‌‌ అవుతుండటం వల్ల 2వ తేదీ నుంచే టీమిండియా ట్రెయినింగ్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ‘ఎనిమిది రోజుల క్వారంటైన్‌‌‌‌లో ఎలాంటి ట్రెయినింగ్‌‌‌‌ ఉండదు. ప్లేయర్లు, సపోర్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌కు కరోనా టెస్ట్‌‌‌‌లు మాత్రం యధావిధిగా జరుగుతాయి. సౌతాంప్టన్‌‌‌‌లో అడుగుపెట్టిన్నప్పట్నించి ప్లేయర్లు ట్రెయినింగ్‌‌‌‌ చేసుకోవచ్చు. టీమ్‌‌‌‌ మొత్తం స్పెషల్‌‌‌‌ చార్టెడ్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌లో యూకేకు వెళ్తుంది. మిగతా అంశాలన్నీ ప్రొటోకాల్‌‌‌‌ ప్రకారం జరుగుతాయి’ అని సదరు అధికారి వ్యాఖ్యానించారు. 


కరోనా దెబ్బకు ఐపీఎల్​ సీజన్​ను వాయిదా వేసుకున్న బీసీసీఐ.. టీమిండియా నెక్స్ట్ టూర్​పై దృష్టి పెట్టింది..! ప్రతిష్టాత్మక వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్​ ఫైనల్ ​(డబ్ల్యూటీసీ)తోపాటు ఇంగ్లండ్​తో టెస్ట్​ సిరీస్​ ​ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది..! అందులో భాగంగా టీమ్‌‌‌‌ మొత్తాన్ని 18 రోజుల హార్డ్‌‌‌‌ క్వారంటైన్‌‌‌‌లో ఉంచనుంది..! ఇండియాతో మొదలుకుని యూకే వరకు ఈ క్వారంటైన్‌‌‌‌ కొనసాగనుంది..! మొత్తానికి మూడు నెలల పాటు లండన్‌‌‌‌లో ఉన్న క్రికెటర్లకు తోడుగా ఫ్యామిలీస్‌‌‌‌ను కూడా పంపించేందుకు బోర్డు గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చింది..! ఓవరాల్‌‌‌‌గా వైరస్‌‌‌‌ దెబ్బకు కాస్త ఆందోళనకు గురైన బీసీసీఐ.. మళ్లీ క్రికెట్‌‌‌‌ను గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది..!!
సిరీస్‌‌‌‌లకు మధ్య లాంగ్‌‌‌‌ బ్రేక్‌‌‌‌
షెడ్యూల్‌‌‌‌ ప్రకారం ఇంగ్లండ్‌‌‌‌, ఇండియా మధ్య ఐదు మ్యాచ్‌‌‌‌ల టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌.. సెప్టెంబర్‌‌‌‌ 14న ముగుస్తుంది. అంటే ఇప్పుడున్న షెడ్యూల్‌‌‌‌ ప్రకారం టీమిండియా మూడు నెలలకు పైగా యూకేలో ఉండాల్సి ఉంటుంది. బబుల్‌‌‌‌ను దాటి బయటకు వెళ్లే చాన్స్‌‌‌‌ లేకపోవడం.. లాంగ్‌‌‌‌ టూర్‌‌‌‌ కావడంతో ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌ను వెంట తీసుకెళ్లేందుకు బీసీసీఐ గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చింది. అయితే ప్లేయర్లతో పాటు ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌ కూడా తప్పనిసరిగా ప్రొటోకాల్‌‌‌‌ను పాటించాల్సిందే. ‘చాలా లాంగ్​ టూర్​ అనే విషయం పక్కనపెడితే కరోనా ప్రొటోకాల్స్​ వల్ల ప్లేయర్లు బయటికి వెళ్లే అవకాశం లేదు. వేరే వ్యక్తులతో మాట్లాడే చాన్స్‌‌‌‌ కూడా ఉండదు. పైగా డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన నెల రోజులకు ఇంగ్లండ్​ సిరీస్​ స్టార్ట్​ అవుతుంది. టైమ్ గ్యాప్​ చాలా ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీ మెంబర్స్​ను వెంట తీసుకెళ్లేందుకు బోర్డు ఓకే చెప్పింది’ అని బోర్డు అధికారి తెలిపారు. టూర్‌‌‌‌కు ముందే క్రికెటర్లందరికీ వ్యాక్సిన్‌‌‌‌ వేయించేందుకు బీసీసీఐ సిద్ధమవుతుందన్నాడు. అయితే పాజిటివ్‌‌‌‌ వచ్చిన ప్రసీధ్‌‌‌‌ కృష్ణ మాత్రం వ్యాక్సిన్‌‌‌‌కు మరికొన్ని రోజులు వేచి ఉండాలన్నాడు.  ప్లేయర్లందరికీ కోవిషీల్డ్‌‌‌‌ వేయిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నామన్నాడు. యూకేలోనూ ఈ వ్యాక్సిన్‌‌‌‌ అందుబాటులో ఉండటంతో సెకండ్​ డోస్​కు ఇబ్బంది ఉండదన్నాడు. 
ఫైనల్‌‌‌‌కు దాదా, జై షా
బీసీసీఐ ప్రెసిడెంట్‌‌‌‌ సౌరవ్‌‌‌‌ గంగూలీ, సెక్రటరీ జై షా.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌‌‌‌కు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు ట్రావెలింగ్‌‌‌‌కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనిపై బోర్డు నుంచి ఎలాంటి అఫీషియల్‌‌‌‌ ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ ఇద్దరు లండన్‌‌‌‌ వెళ్తే.. మిగతా ఐపీఎల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల గురించి ఈసీబీ అధికారులతో చర్చించే అవకాశముందని బోర్డు వర్గాలు తెలిపాయి. ఐసీసీ పాలసీలపై కూడా చర్చలు జరిపే చాన్స్‌‌‌‌ ఉంది.