Mirai Teaser: మిరాయ్ టీజర్‌ రిలీజ్.. ‘9 పుస్తకాలు.. వందల ప్రశ్నలు’.. విలన్గా మనోజ్ విధ్వంసం

Mirai Teaser: మిరాయ్ టీజర్‌ రిలీజ్.. ‘9 పుస్తకాలు.. వందల ప్రశ్నలు’.. విలన్గా మనోజ్ విధ్వంసం

యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న యాక్షన్ అడ్వంచరస్‌‌‌‌ మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. 

నేడు (మే28) బుధవారం ‘మిరాయ్’ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. '9 పుస్తకాలు. 100 ప్రశ్నలు. 1 స్టిక్. బిగ్ అడ్వెంచర్' అని టీజర్ కు క్యాప్షన్ ఇచ్చారు. జరగబోయేది మారణ హోమం.. శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం.. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్నీ ఆపలేదు..' అని సీనియర్ హీరో జయరామ్ మాట్లాడిన మాటలు సినిమాపై ఆసక్తి పెంచాయి.

ఆ తర్వాత మనోజ్ ఎంట్రీ.. అతను సీరియస్ యాంగిల్, చిన్నప్పుడు మాస్టర్ కొట్టిన రాయిపై ఉన్న కోపంతో విజృంభించడం టీజర్ కి ఇంపాక్ట్ చూపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే విలన్ గా మనోజ్ విధ్వంసం సృష్టిస్తుంచాడు. తనకు ఎవ్వరూ అడ్డొచ్చినా వారిని ఇట్టే అంతమొందిస్తుంటాడు. ఈ ప్రమాదాన్ని ఆపే దారే లేదా అని శ్రీయా అంటుంది.

ఆ తర్వాత జగపతి బాబు ఉక్రోశం, జయరాం మాటలు ఉత్తేజంగా ఉన్నాయి. ఈ సారి దారి యుగాల వెనుక ఆవతరించిన ఓ ఆయుధం చూపిస్తుంది.. అదే మిరాయ్' అని జయరాం అనగానే సూపర్ యోధగా తేజ ఎంట్రీ అదిరిపోయింది. సూపర్ యోధగా నటిస్తున్న తేజ పెరఫామెన్స్ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ను ఇస్తుంది. “తొమ్మిది పుస్తకాలు.. వందల ప్రశ్నలు.. వన్ స్టిక్” అని మిరాయ్ ను పట్టుకొని అంటాడు సూపర్ యోధ (తేజ సజ్జా).

పుస్తకాల్లో ఏవో రహస్యాలు ఉంటాయి. బిగ్ అడ్వెంచర్ అంటూ రంగంలోకి దిగుతాడు యోధ. ఇటువంటి ఆసక్తిర సన్నివేశాలతో సాగిన మిరాయ్ టీజర్.. గ్రాండ్ విజువల్స్, యాక్షన్‍తో కంప్లీట్ సక్సెస్ ను సూచించేలా ఉంది. 

ప్రస్తుతం ముంబైలోని చారిత్రాత్మక గుహలలో షూటింగ్‌‌‌‌ జరుగుతోంది. తేజతో పాటు లీడ్ యాక్టర్స్‌‌‌‌పై కీలక సన్నివేశలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో మంచు మనోజ్ విలన్‌‌‌‌గా కనిపించనుండగా, రితికా నాయక్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.