ధాన్యం కొనుగోలుకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్

 ధాన్యం కొనుగోలుకు కలెక్టరేట్ లో  కంట్రోల్ రూమ్

హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్ సోమేశ్ కుమార్. కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును మానిటర్ చేయాలని అధికారులకు సూచించారు సీఎస్. వ్యవసాయ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శులు, పౌర సరఫరాల కమిషన్, మార్కెటింగ్ డైరెక్టర్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. జిల్లాలోని మంత్రులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి... ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. రోజుకు కనీసం నాలుగైదు కొనుగోలు కేంద్రాలను అధికారులు సందర్శిచాలన్నారు. ప్రత్యేక అధికారిని నియమించి గన్నీ బ్యాగుల సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. క్వింటాల్ కు 1,960 కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని సేకరించి.. రవాణాకు వీలుగా వాహనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం సేకరణపై రోజువారీ నివేదికలు సమర్పించాలన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. 

అక్బరుద్దీన్పై నమోదైన కేసుల కొట్టివేత

ఇకపై లంచ్ బ్రేక్ అరగంటే..