
న్యూఢిల్లీ: డిమాండ్ పుంజుకోవడం, కరోనా ఎఫెక్ట్ తగ్గిపోవడంతో ఫిబ్రవరి నెలలో సర్వీస్ సెక్టార్ పుంజుకుంది. అయితే రేట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ మాత్రం గత జూలై తరువాత ఈ ఫిబ్రవరిలోనే తక్కువగా రికార్డయిందని ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వే పేర్కొంది. సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఈ ఏడాది జనవరిలో 51.5 ఉండగా, ఫిబ్రవరి నాటికి 51.8 కి పెరిగింది. ఆశించిన విధంగా బుకింగ్స్రావడం, డిమాండ్ ఉండటం ఇందుకు కారణమని ఐహెచ్ఎస్ మార్కిట్ ప్రకటించింది. కొత్త బిజినెస్లు, సర్వీసుల కార్యకలాపాలు కొద్దిగానే పెరిగాయని తెలిపింది. ధరల పెరుగుదల ఒత్తిళ్లు, ఇన్పుట్షార్టేజీలు, లోకల్ ఎలెక్షన్ల వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డి లిమా అన్నారు.