పదేళ్ల పిలగాడు పుస్తకం రాసిండు

V6 Velugu Posted on Aug 04, 2021

ఖగోళ శాస్త్రం గురించి నేర్చుకునేది ‘ఆస్ట్రోఫిజిక్స్‌‌’. ఈ సబ్జెక్ట్‌‌ పిల్లలకు అర్థం కావడం కష్టం. అలాంటిది ఈ సబ్జెక్ట్‌‌పై ఏకంగా పుస్తకమే రాశాడు పదేళ్ల పిలగాడు. కోల్‌‌కతాకు చెందిన రేయాన్ష్‌‌ దాస్‌‌ ‘ద యూనివర్స్‌‌: ద పాస్ట్‌‌, ద ప్రజెంట్‌‌ అండ్‌‌ ద ఫ్యూచర్‌‌‌‌’ పేరుతో రాసిన పుస్తకాన్ని చాలామంది మెచ్చుకుంటున్నారు. రేయాన్ష్‌‌ దాస్‌‌కు చిన్నప్పటినుంచే సైన్స్‌‌, నక్షత్రాలు, గెలాక్సీ అంటే ఎంతో ఆసక్తి. నక్షత్రాలు ఎలా ఏర్పడతాయి? అవెందుకు మెరుస్తుంటాయి? వంటి ప్రశ్నలు రేయాన్ష్‌‌ మనసులో మెదిలేవి. వాటికి సమాధానాలు తెలుసుకునేందుకు పుస్తకాలు చదివేవాడు. స్పేస్‌‌ వీడియోలు చూసేవాడు. ట్యాబ్‌‌ చేతిలో ఉంటే చాలామంది పిల్లలు గేమ్స్‌‌ ఆడటాన్ని ఇష్టపడతారు. కానీ, రేయాన్ష్‌‌ మాత్రం సబ్జెక్ట్‌‌ గురించి వెతికేవాడు. డౌట్స్‌‌ ఉంటే మామయ్యను అడిగేవాడు. దాంతో పదేళ్లు వచ్చేసరికి ఆస్ట్రోఫిజిక్స్‌‌పై బాగా అవగాహన వచ్చింది. 
తల్లి ప్రోత్సాహంతో
తల్లి ప్రోత్సాహంతో రాసిన ఈ పుస్తకంలో చాలా విషయాలు చర్చించాడు. ఐజాక్‌‌ న్యూటన్‌‌కు, ఐన్‌‌స్టీన్‌‌కు ఉన్న తేడా, ఫ్యూచర్‌‌‌‌ ఆఫ్‌‌ యూనివర్స్‌‌, డార్క్‌‌ మ్యాటర్‌‌‌‌, స్పేస్‌‌టైమ్‌‌, సోలార్‌‌‌‌ సిస్టమ్‌‌ వంటి ఎన్నో అంశాల్ని చాలా ఇంట్రెస్టింగ్‌‌గా చెప్పాడని ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నారు. రీసెర్చ్‌‌ స్కాలర్‌‌‌‌ నందితా రాహాతోపాటు, ఫిజిసిస్ట్‌‌లు ‘బుక్‌‌ బాగుంది’ అని  రేయాన్ష్‌‌ను మెచ్చుకున్నారు. ముందుముందు స్పేస్‌‌ ను ఎక్స్‌‌ప్లోర్‌‌‌‌ చేయాలనుకుంటున్నాడట రేయాన్ష్‌‌. 
 

Tagged BOY, wrote, book,

Latest Videos

Subscribe Now

More News