గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ ఛాంబర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు ఏ పదవి చేయలేదని తనను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించిన అందరికి దన్యవాదాలని అన్నారు.
తనపై నమ్మకంతో ఓట్లు వేసిన గ్రాడ్యుయేట్లందరికి ధన్యవాదాలని బాధ్యత గలిగిన వ్యక్తిగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణా రావు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.