అక్టోబర్ 7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

అక్టోబర్ 7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  • కోవిడ్ మార్గదర్శకాల మేరకు ఏకాంతంగా ఉత్సవాలు

తిరుపతి: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అక్టోబ‌రు 7 నుంచి 15వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఇందుకోసం అక్టోబ‌రు 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.
06.10.2021 - బుధ‌వారం - అంకురార్ప‌ణ - సాయంత్రం 6 నుండి 7 గంటల వ‌ర‌కు..
07.10.2021 - గురువారం - ధ్వ‌జారోహ‌ణం(మీన‌ల‌గ్నం) - సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల వ‌ర‌కు.
08.10.2021 - శుక్ర‌వారం - చిన్న‌శేష వాహ‌నం -ఉద‌యం 9 నుండి 10వ‌ర‌కు.. హంస వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.
09.10.2021 - శ‌నివారం - సింహ వాహ‌నం -ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.. స్న‌ప‌న‌తిరుమంజ‌నం- మధ్యాహ్నం 1 నుండి 3గంటల వ‌ర‌కు.. ముత్యపుపందిరి వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.
10.10.2021 - ఆదివారం - క‌ల్ప‌వృక్ష వాహ‌నం - ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు... స్న‌ప‌న‌తిరుమంజ‌నం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వ‌ర‌కు.. స‌ర్వ‌భూపాల‌ వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.
11.10.2021 - సోమ‌వారం - మోహినీ అవ‌తారం - ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.. గ‌రుడ‌సేవ‌ - రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు.. 
12.10.2021 - మంగ‌ళ‌వారం - హ‌నుమంత వాహ‌నం - ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.. స్వ‌ర్ణ‌ర‌థం బ‌దులుగా స‌ర్వ‌భూపాల వాహ‌నం - సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.. గ‌జ వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.
13.10.2021 - బుధ‌వారం - సూర్య‌ప్ర‌భ వాహ‌నం - ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు... స్న‌ప‌న తిరుమంజ‌నం - మ‌ధ్యాహ్నం 1 నుండి 3 గంటల వ‌ర‌కు.. చంద్ర‌ప్ర‌భ వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.
14.10.2021 - గురువారం - ర‌థోత్స‌వానికి బ‌దులుగా స‌ర్వ‌భూపాల వాహ‌నం- ఉద‌యం 7.35గంట‌ల‌కు... అశ్వ వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.. 
15.10.2021 - శుక్ర‌వారం - ప‌ల్ల‌కీ ఉత్స‌వం మ‌రియు తిరుచ్చి ఉత్స‌వం - ఉద‌యం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.. స్న‌ప‌న‌తిరుమంజ‌నం మ‌రియు చ‌క్ర‌స్నానం - ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు(అయిన మ‌హ‌ల్‌లో).. ధ్వ‌జావ‌రోహ‌ణం - రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు..